లడ్డూ వివాదం: ‘బాబు, లోకేష్‌ తిరుమలలో ప్రమాణం చేయగలరా?’ | YSRCP Leaders Questioned Chandrababu Naidu And Nara Lokesh Over Tirupati Laddu Row, More Details Inside | Sakshi
Sakshi News home page

Tirupati Laddu Controversy: ‘బాబు, లోకేష్‌ తిరుమలలో ప్రమాణం చేయగలరా?’

Published Thu, Sep 26 2024 1:20 PM | Last Updated on Thu, Sep 26 2024 2:34 PM

YSRCP Leaders Questioned Chandrababu Over Tirupati Laddu

సాక్షి, తిరుపతి: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ, సిట్టింగ్‌ జడ్డీతో విచారణ జరిపించాలన్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. రాజకీయ లబ్ధి కోసం తిరుమల శ్రీవారిపై తప్పుడు ప్రచారం చేసిన వారికి దేవుడే తగిన శిక్ష విధిస్తాడని చెప్పుకొచ్చారు.

మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కులాలు, మతాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలను చూస్తుంటే మత ఘర్షణలను ప్రేరేపిస్తున్నట్టు ఉంది. రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తున్న వారికి దేవుడే తగిన శిక్ష వేస్తాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

ఇదే అంశంపై నెల్లూరు జిల్లాలో కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. మామని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు వంద రోజుల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ డ్రామాకు తెర తీశారు. వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేయడం దారుణం. లడ్డూలో కల్తీ జరిగిందని చంద్రబాబు, లోకేష్‌ తిరుమలలో ప్రమాణం చేయగలరా?’ అని సవాల్‌ విసిరారు. 

తిరుమలలో ప్రమాణం చేస్తారా? నారాయణ స్వామి కామెంట్స్

ఇది కూడా చదవండి: ఎన్టీఆర్‌ దేవరకు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ సెగ
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement