
సాక్షి, అమరావతి: చంద్రబాబుకు ఇక రాజకీయ నిష్క్రమణే అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కుప్పం మున్సిపల్ సహా అన్ని ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలందరూ సీఎం జగన్ వైపే ఉన్నారన్నారు.
చదవండి: బాబు నిన్న చర్చించాడు.. నేడు అమలు చేశాడు: కొడాలి నాని
‘‘సభలో టీడీపీ సభ్యులు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. చంద్రబాబు సొంతంగా ఎప్పుడూ సీఎం కాలేదు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రాజకీయ భవిష్యత్ లేదని చంద్రబాబుకు అర్థమైంది. అందుకే సభలో సానుభూతి పొందాలని చంద్రబాబు చూశారు. సభలో చంద్రబాబు నటనా చాతుర్యం ప్రదర్శించారని’’ అంబటి రాంబాబు దుయ్యబట్టారు.
చదవండి: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment