
విశాఖపట్నం: ‘విపకక్షాలు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నాయి. ఎక్కడ ఏం జరిగినా ప్రభుత్వానికే అంటగడుతున్నాయి. ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకుని టీడీపీ విషం చిమ్ముతోంది’’ అని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులపైన విపక్షాలు ఆధారులు లేని ఆరోపణలు చేస్తున్నాయని అమర్నాథ్ మండిపడ్డారు.
ఈ సందర్భంగా అమర్‌నాథ్ మాట్లాడుతూ.. ‘‘ప్రతిపక్షం నిర్మాణాత్మక విమర్శలు చేస్తే స్వీకరిస్తాం. కానీ సంబంధం లేని అంశాల్లో అసత్య ఆరోపణలు చేయడం తగదు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్న చంద్రబాబు, టీడీపీ నేతలు.. ఆ పార్టీ నేతృత్వంలో నడుస్తోన్న పత్రికలపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరుతున్నాము’’ అని డిమాండ్ చేశారు.
(చదవండి: ‘టీడీపీ ఉద్దండులు.. దద్దమ్మల్లా మాట్లాడారు’)
‘‘విశాఖపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోంది. ఎక్కడో డ్రగ్స్ దొరికితే ఇక్కడి నాయకులకు సంబంధం ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ శవం దొరికినా రాజకీయం చేయడం టీడీపీకి అలవాటుగా మారింది. రాజకీయం కోసం రాష్ట్ర ప్రతిష్టను నాశనం చేస్తున్నారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పడి పోయినా.. ప్రజల మనోభావాలు దెబ్బ తిన్న చంద్రబాబుకు బాధ్యత లేదు. ఎన్నికల్లో ప్రజలు ఓడించడంతోనే.. చంద్రబాబు ఇలా కక్ష పూరితంగా మాట్లాడుతున్నారు. ఇల్లు, వ్యాపారం, మీటింగ్‌లు అన్ని హైదరాబాద్‌లో ఉన్న మీకు ఏపీతో సంబంధం ఏంటి’’ అని అమర్‌నాథ్ ప్రశ్నించారు.
చదవండి: ఏం చంద్రబాబు ఇప్పుడేమంటారు..?
Comments
Please login to add a commentAdd a comment