
సాక్షి, తాడేపల్లి: చిత్తూరు జిల్లాలో మాజీ జడ్జి రామకృష్ణ సోదరుడిపై పెద్దిరెడ్డి అనుచరులే దాడి చేశారని టీడీపీ తప్పుడు ప్రచారం చేసిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు. దాడి చేయాల్సిన అవసరం మంత్రి పెద్దిరెడ్డి అనుచరులకు కానీ.. వైఎస్సార్‌సీపీకి కానీ లేదన్నారు. చిత్తూరు జిల్లాలో ఏది జరిగినా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అంటగట్టే యత్నం చేస్తున్నారని, చంద్రబాబు పథకం ప్రకారమే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసుల విచారణలో మంత్రి పెద్దిరెడ్డికి సంబంధం లేదని తేలిపోయిందని, ఇప్పుడు చంద్రబాబు కచ్చితంగా సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టే పని చంద్రబాబు చేస్తున్నారని మేరుగ నాగార్జున నిప్పులు చెరిగారు. (చదవండి: ఆ సమావేశానికి కర్త కర్మ క్రియ చంద్రబాబే..)
Comments
Please login to add a commentAdd a comment