
హుజూరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న షర్మిల
హుజూరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని, ఇందులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు సైతం ముడుపులు అందాయని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ‘బండి సంజయ్‌కి వాటాలు ముట్టినట్లు హుజూరాబాద్ గడ్డనుంచే ఆరోపణ చేస్తున్న. సంజయ్ అమాయకుడయితే.. నిర్దోషి అయితే.. నోరు విప్పాలి.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై మాట్లాడాలి’ అని డిమాండ్ చేశారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని బూడిదపల్లి, జాగీర్‌పల్లి, చింతలపల్లి, ఎలబోతారం మీదుగా హుజూరాబాద్‌కు చేరింది. స్థానిక అంబేడ్కర్ చౌర స్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎమ్మెల్యేకు ఎక్కువ, మంత్రికి తక్కువయ్యారని విమర్శించారు. అంతకుముందు.. పాదయాత్ర 3,300 కిలోమీటర్ల మైలురాయి ని దాటిన సందర్భంగా బోర్నపల్లి వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment