
తురిమెళ్లలో ఎమ్మెల్యే అన్నాకు స్వాగతం పలుకుతున్న స్థానికులు
కంభం: వైఎస్సార్ సీపీ పాలనలో అర్హుల గడపల వద్దకే సంక్షేమ పథకాలు చేరుతున్నాయని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు అన్నారు. మండలంలోని తురిమెళ్ల గ్రామంలో గురువారం సాయంత్రం ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. సచివాలయం పరిధిలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. అర్హత ఉండి ఇంకా సంక్షేమ పథకాలు అందని వారుంటే వారి వివరాలు నమోదు చేసుకొని వారికి పథకాలు అందేలా చూడాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారు సంతోషంగా స్వాగతం పలుకుతున్నారని పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాల్లో ఎన్నో మార్పులు జరిగాయని, పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య అందడంతో పాటు మెరుగైన వైద్య సేవలందుతున్నాయని పేర్కొన్నారు. ఏ ఒక్క అర్హుడికి నష్టం జరగ కూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సర్పంచ్ సుభద్ర, ఎంపీటీసీ సభ్యురాలు ఖాసింబీ, మండల కన్వీనర్ గొంగటి చెన్నారెడ్డి, జేఏసీ కన్వీనర్ డిష్ మున్నా, కంభం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్‌లు యేలం వెంకటేశ్వర్లు, సర్పంచులు పల్నాటి బోడయ్య, యేలం శివ, ఏరువ కృష్ణారెడ్డి, గంగారపు కృష్ణ, గాలేశ్వరరావు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు
Comments
Please login to add a commentAdd a comment