వైఎస్ జగన్‌ను కలిసిన వైఎస్సార్ సీపీ నాయకులు
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ని తాడేపల్లిలో జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు కలిశారు. రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు, లిడ్ క్యాప్ మాజీ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకర్, జెడ్పీటీసీ సైకం లక్ష్మీశారద, ఆళ్ల రవీంద్రారెడ్డి, సైకం రాంబాబు, కార్పొరేటర్లు వెన్నపూస కుమారి, ఇమ్రాన్‌ఖాన్, ప్రవీణ్ కుమార్, పార్టీ నాయకుడు వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, కో ఆప్షన్ మెంబర్లు ఎస్కే.రషిదా, ఎస్కే నాగుర్, శ్యాంసాగర్, పార్టీ నాయకులు కఠారి ప్రసాద్, చావలి శివప్రసాద్, పి.సురేష్, బి.రవణమ్మ, పుల్లయ్య, వెంకటరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఒంగోలు నియోజకవర్గంలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
వైఎస్ జగన్‌ను కలిసిన బూచేపల్లి
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తాడేపల్లిలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాలో పార్టీ స్థితిగతులపై చర్చించారు.
వైఎస్ జగన్‌ను కలిసిన వైఎస్సార్ సీపీ నాయకులు
Comments
Please login to add a commentAdd a comment