
రోడ్డు భద్రతా పద్ధతులు పాటించాలి
ఒంగోలు వన్‌టౌన్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా పద్దతులను పాటించాలని కలెక్టర్ ఎ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలు రవాణాశాఖ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు సభలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం, ఓవర్ కాన్ఫడెన్సు కారణంగా జరుగుతున్నాయన్నారు. ప్రతి నెలా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహిస్తారని, ఈ సమావేశంలో నిర్ణయించిన అంశాలు అమలు చేస్తారన్నారు. శాఖాపరమైన నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో ఎక్కడా రోడ్డు ప్రమాదాలు జరుగకూడదన్నారు. ప్రజల్లో మార్పు రావాలన్నారు. నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ వేగం కంటే ప్రాణం ఎంతో విలువైందని ఆ ప్రాణం కూడా మన చేతుల్లోనే ఉందన్నారు. వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆటో డ్రైవర్లు జాగ్రత్తగా నడిపి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ ఉప కమిషనర్ సుశీల, ఆర్‌అండ్‌బీ, నేషనల్ హైవే శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు
Comments
Please login to add a commentAdd a comment