వాలీబాల్ విజేత ప్రకాశం
● పురుషుల, మహిళల విభాగాల్లో
ప్రథమస్థానం
● ద్వితీయ స్థానంలో తూర్పుగోదావరి, విజయవాడ
ఒంగోలు: మూడురోజుల పాటు ఉత్కంఠగా సాగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ ఇన్విటేషన్ టోర్నమెంట్ కరవదిలో ఆదివారం ముగిసింది. పోటీల్లో ప్రకాశం జిల్లా క్రీడాకారులు పురుషుల విభాగం, మహిళల విభాగంలో రాణించి ప్రథమస్థానంలో నిలిచి ప్రకాశం క్రీడా పతాకాన్ని రెపరెపలాడించారు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరుగుతున్న పోటీలు కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి క్రీడాభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉత్సాహభరితంగా, ఉత్కంఠగా సాగిన పోటీల్లో ప్రకాశం జట్టు పురుషుల విభాగంలోను, మహిళల విభాగంలోను పైచేయి కనబరిచి ప్రథమస్థానాన్ని కై వసం చేసుకున్నాయి. పురుషుల విభాగంలో తూర్పుగోదావరి జట్టు ద్వితీయ స్థానంతో నిలిచింది. మహిళల విభాగంలో ఎంవీపీ ట్రస్టు విజయవాడ జట్టు ద్వితీయస్థానంలో నిలిచింది. పురుషుల విభాగంలో కృష్ణా, వైఎస్సార్ కడప జట్టు 3,4 స్థానాలలో నిలవగా, మహిళల విభాగంలో వైఎస్సార్ కడప జట్టు తృతీయస్థానంలో నిలిచింది. పోటీల అనంతరం విజేతలకు బహుమతులను ప్రముఖులు డాక్టర్ శంకరరావు, డాక్టర్ మల్లికార్జునరావు, పారిశ్రామిక వేత్త సుబ్బారెడ్డి, అడ్వకేట్ శిరిగిరి రంగారావు, బైబిల్ మిషన్ గుంటూరు గవర్నింగ్ బాడీ సభ్యులు ఆర్‌ఎంపీ కుమార్, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు తదితరులు ప్రదానం చేశారు.
వాలీబాల్ విజేత ప్రకాశం
Comments
Please login to add a commentAdd a comment