అత్యవసరమైతేనే సిజేరియన్ కాన్పులు చేయాలి
ఒంగోలు టౌన్: అత్యవసరమైతేనే తప్ప సిజేరియన్ కాన్పులు చేయరాదని, సాధారణ కాన్పులకు ప్రోత్సహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉప సంచాలకుడు శ్రీనివాసులు రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. డీఎంహెచ్‌ఓ డా.వెంకటేశ్వరరావుతో కలిసి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న జనన, మరణ వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువగా సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పులు చేయించుకున్న వారికి డిశ్చార్జ్ సమయంలోనే బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పారు. ప్రసవాలకు సంబంధించిన రికార్డులన్నింటినీ ఎప్పటికప్పుడు పూర్తి సమాచారంతో పోర్టల్ లో అప్లోడ్ చేయాలని సూచించారు. జిల్లాలోని అన్నీ ప్రాథమిక వైద్యాశాలల్లో ప్రతి నెలా కనీసం 10 కాన్పులు చేయాలని చెప్పారు. అవసరమైన మందులు, వైద్య పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో అకౌంటెంట్ ప్రసాద్, జిల్లా మాస్ మీడియా అధికారి డి.శ్రీనివాసులు, డేటా మేనేజర్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉప సంచాలకుడు శ్రీనివాసులు రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment