విద్యార్థులు ఒత్తిడికి గురికావద్దు
ఒంగోలు వన్‌టౌన్: పదో తరగతి విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డైరక్టర్ ఎ.లక్ష్మా నాయక్ అన్నారు. ఒంగోలు అంబేడ్కర్ భవన్‌లో జిల్లాలోని ఒంగోలు, కొండపి సహాయ సాంఘిక సంక్షేమ అధికారుల పరిధిలోని 15 వసతి గృహాల్లో ఉంటూ పదో తరగతి విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు శుక్రవారం ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా డెప్యూటీ డైరక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 7 సహాయ సాంఘిక సంక్షేమ అధికారుల పరిధిలో పదో తరగతి విద్యనభ్యసిస్తున్న 934 మందికి ఈ ప్రేరణ తరగతులను ఎక్కడికక్కడ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సబ్జెకులో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు 6 సబ్జెక్టుల్లో ప్రావీణ్యం ఉన్న ఉత్తమ ఉపాధ్యాయుల ద్వారా ఈ ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒంగోలులో నిర్వహించిన ఈ ప్రేరణ తరగతుల్లో మొత్తం 183 మంది విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు ఇప్పటికే ఆల్ ఇన్ వన్ గైడ్లు, స్టడీ మెటీరియల్, స్టేషనరీ మెటీరియల్‌ను అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ నీలిమ, డీసీఈబీ శ్రీనివాసరావు, జిల్లా విద్యాశాఖ అధికారి బీ కిరణ్ కుమార్, మండల విద్యాశాఖ అధికారులు కిషోర్, సహాయ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి టీ లింగయ్య, వసతి గృహ అధికారులు డీ అంకబాబు, సిబ్బంది పాల్గొన్నారు.
పది విద్యార్థుల ప్రేరణ తరగతుల్లో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్
Comments
Please login to add a commentAdd a comment