బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఒంగోలు సబర్బన్: బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో కర్నూలు రోడ్డులోని ఎస్‌బీఐ టౌన్ బ్రాంచ్ ముందు శుక్రవారం సాయంత్రం నిరసన వ్యక్తం చేశారు. మార్చి 24, 25 తేదీల్లో జరగనున్న దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా సన్నాహక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఒంగోలు నగరంలోని బ్యాంకులతో పాటు పరిసర ప్రాంతాల్లోని దాదాపు 9 యూనియన్లకు చెందిన బ్యాంకుల ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరసనలో కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగుల పట్ల ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ సీనియర్ నాయకులు, ఎస్‌బీఐ ఎస్‌యూఏసీ గుంటూరు మాడ్యూల్ వైస్ ప్రెసిడెంట్ వీఎస్‌ఆర్ సుధాకర రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మేనేజ్‌మెంట్‌లను అడ్డంపెట్టుకొని బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రజలకు జరిగే నష్టాన్ని తెలియజేయటానికి బ్యాంకు ఉద్యోగులందరూ స్వచ్ఛందంగా రోడ్డుమీదకు వచ్చారన్నారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో వారంలో 5 రోజుల పనిదినాలు, బ్యాంకుల్లో అన్ని తరగతుల ఉద్యోగాల భర్తీచేయాలని డిమాండ్ చేశారు. టెంపరరీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు. నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు వెంకట రెడ్డి, వి.శ్రీనివాస రావు, సీహెచ్.శ్రీనివాస రావు, సుబ్బారావు, షేక్ హసన్, ఉమా శంకర్‌తో పాటు 9 బ్యాంకు యూనియన్లకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
మార్చి నెల 24, 25 తేదీల్లో దేశ వ్యాప్త సమ్మె సన్నాహక నిరసనలో యూఎఫ్‌బీయూ నాయకులు
Comments
Please login to add a commentAdd a comment