పీడీ యాక్ట్ పెడతాం
గుప్త నిధుల పేరుతో వారసత్వ సంపదను ధ్వంసం చేస్తే పీడీ యాక్ట్ పెడతాం. పురాతన సంపదలైన ప్రసిద్ధి చెందిన దేవాలయాలు, శతాబ్దాల నాటి శాసనాలను రక్షించుకునేందుకు గట్టి చర్యలు తీసుకుంటాం. సులభంగా డబ్బులు సంపాదించాలని రైస్ పుల్లింగ్ పేరుతో బయలు దేరిన ముఠాల వివరాలు సేకరించమని అధికారులను ఆదేశించా. నేరాలకు పాల్పడిన ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షిస్తాం. వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. ప్రజలు కూడా ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మొద్దు. గుప్త నిధులు లేవు, రైస్ పుల్లింగ్ లేదు. ఇలాంటివి నమ్మి చేజేతులా డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా పోలీసు కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులు పడతారు.
– ఎస్పీ ఏఆర్ దామోదర్
Comments
Please login to add a commentAdd a comment