గోదావరి జిల్లాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిన నేపథ్యంలో చికెన్ అమ్మకాలు పడిపోయాయి. నిన్న మొన్నటి వరకు చికెన్ కిలో రూ.250 ఉండగా ప్రస్తుతం రూ.180కి తగ్గించినా కొనుగోళ్లు బాగా మందగించాయి. ఒంగోలులో చికెన్ దుకాణాలన్నీ కళ తప్పాయి. మరో పక్క మటన్, చేపలకు గిరాకీ పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మటన్ అమ్మకాలు సాగాయి. చేపల ధరలను మాత్రం బాగానే పెంచి విక్రయించారు. బర్డ్ ఫ్లూకు ముందు కిలో మోయ చేపలను రూ.200 నుంచి రూ.250లకు విక్రయించగా.. ఇప్పుడు రూ.250 నుంచి రూ.300 వరకు విక్రయించారు. అవసరాన్ని ఆసరాగా చేసుకొని అన్నీ రకాల చేపలపై రూ.50 నుంచి రూ.100 అదనంగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
–ఒంగోలు టౌన్
Comments
Please login to add a commentAdd a comment