జిల్లా టెన్నికాయిట్ జట్ల ఎంపిక
సింగరాయకొండ: మండల కేంద్రంలోని ఏఆర్‌సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజి ఆవరణలో ఆదివారం ప్రకాశం జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలబాలికల జిల్లా టెన్నికాయిట్ జట్ల ఎంపిక నిర్వహించారు. బాలుర విభాగంలో ఆర్ కార్తికేయ, ఎం శివశంకర్, వీ వెంకటేశ్వర్లు రెడ్డి, డీ కౌశిక్‌బాబు, కే హర్షవర్దన్, బాలికల విభాగంలో బీ జాస్మియా, పీ జాహ్నవి, ఎల్ నిఖిత, బీ పద్మ, బీ కృప ఎంపికై నట్లు అసోసియేషన్ జిల్లా సెక్రటరీ ఎన్‌టీ ప్రసాద్ తెలిపారు. జిల్లా జట్లకు ఎంపికై న వారు ఈనెల 20, 27 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన వివరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ట్రెజరర్ కే శంకరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment