మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడం ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అత్యధికంగా గిద్దలూరు–దిగువమెట్ట, గిద్దలూరు–బేస్తవారపేట, మార్కాపురం–కంభం, మార్కాపురం–దేవరాజుగట్టు, దేవరాజుగట్టు–కుంట, కుంట నుంచి త్రిపురాంతకం మధ్య ఉన్న నేషనల్ హైవేపై సర్వీసు రోడ్లు సరిగా లేకపోవడంతో టూ వీలర్స్‌పై వచ్చేవారు రోడ్డెక్కే సమయంలో తరచుగా ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా గిద్దలూరు నుంచి త్రిపురాంతకం మధ్య హైవేపై ప్రతి వారం ఒక మేజర్ రోడ్డు యాక్సిడెంట్ చోటుచేసుకుంటోంది.
డివిజన్‌లో 15 బ్లాక్ స్పాట్స్
మార్కాపురం డివిజన్‌లో మొత్తం 15 బ్లాక్ స్పాట్స్‌ను అధికారులు గుర్తించారు. ఇందులో మార్కాపురం మండలం కుంట, పెద్దారవీడు మండలం కుంట, గొబ్బూరు, త్రిపురాంతకం, దరిమడుగు వై జంక్షన్, తిప్పాయపాలెం, జంగంగుంట్ల, బేస్తవారపేట క్రాస్‌రోడ్స్, గిద్దలూరు, తర్లుపాడు–తాడివారిపల్లి హైవే ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్లను పోలీసులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టడంతోపాటు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నా ఆశించిన ఫలితం లేకపోవడం ఆందోళన కలిగించే అంశం.
Comments
Please login to add a commentAdd a comment