జాతీయ రహదారి
మార్కాపురం:
జాతీయ రహదారిపై ప్రయాణం సాఫీగా సాగిపోతుందని ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు గాల్లో కలిసినట్టే! పశ్చిమ ప్రకాశంలో పలు రహదారులు, మూలములుపులు ప్రయాణికుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. అనంతపురం–విజయవాడ నేషనల్ హైవేపై తరచూ సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాలు వందలాది కుటుంబాల్లో విషదాన్ని నింపాయి. నేషనల్ హైవే వెంట ఉన్న గ్రామాల వద్ద క్రాస్‌రోడ్లు, మూల మలుపుల వద్ద స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం, వాహనదారుల అజాగ్రత్త కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుని పలువురు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. క్షతగాత్రులై చావు అంచుల వరకు వెళ్లి వచ్చినవారు మృతులకు రెట్టింపు సంఖ్యలో ఉన్నారు. అనంతపురం–విజయవాడ నేషనల్ హైవే పశ్చిమ ప్రకాశంలో గిద్దలూరు సమీపం నుంచి మొదలై త్రిపురాంతకం వరకు విస్తరించి ఉంది.
ఈ హైవే రోడ్డులో 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 354 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా 331 మంది మృత్యువాతపడ్డారు. ఆయా ప్రమాదాల్లో 685 మంది క్షతగాత్రులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment