
బఫర్ గోడౌన్‌ను తనిఖీ చేసిన జేసీ
మద్దిపాడు: మండలంలోని గుండ్లాపల్లి గ్రామంలో ఓం శ్రీ భావనాసాయి వేర్హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ బఫర్ గోడౌన్‌ను జేసీ గోపాలకృష్ణ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందులో ఉన్న స్టాక్ వివరాలను పరిశీలించారు. రైతుల వద్ద నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించి అనుసంధానం చేయబడిన మిల్లులకు రవాణా చేయబడి క్లస్టర్ మిల్లింగ్ ద్వారా మిల్లింగ్ చేయబడిన ఫోర్టిఫైడ్ రైస్ నిల్వ చేయడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని గోడౌన్ సిబ్బందికి సూచించారు. ఇతర జిల్లాల నుంచి రవాణా చేయబడి బఫర్ గోడౌన్లో నిల్వ చేయబడి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మార్చి 2025 అలాట్మెంట్‌కు సిద్ధంగా ఉన్న బియ్యం వివరాలను పరిశీలించారు. ఈ బియ్యాన్ని జిల్లాలోని 10 మండల స్టాక్ పాయింట్లకు రవాణా చేయడానికి కావాల్సిన హమాలీలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎగుమతి, దిగుమతి కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్టాక్ వివరాలను గోడౌన్ల వారీగా తెలుపుతూ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. బియ్యం గోతాల నుంచి కారిపోయిన బియ్యాన్ని కూడా సేకరించి శుభ్రపరిచి గోదాంలో భద్రపరచాలని సిబ్బందికి సూచించారు. ముందుగా కొలచనకోట గ్రామంలో జరుగుతున్న రీ సర్వేని జేసీ పరిశీలించారు. రెవెన్యూ సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. రీ సర్వే జరుగుతున్న క్రమంలో ప్రతి రైతుకూ నోటీసులిస్తున్నారా.. లేదా..? అనే అంశాలను పరిశీలించి సర్వే అసిస్టెంట్లకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రైతుకూ నోటీసులు అందించి వారి ఎదుటే సర్వే చేయాలని ఆదేశించారు. జేసీ వెంట ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, మద్దిపాడు తహసీల్దార్ సుజన్‌కుమార్, జిల్లా సివిల్ సప్లయిస్ మేనేజర్ వరలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment