
అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి
ఒంగోలు టౌన్: అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతిచెందిన సంఘటన జాతీయ రహదారిపై స్థానిక త్రోవగుంట సమీపంలో చోటుచేసుకుంది. ఒంగోలు తాలూకా పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని త్రోవగుంట వద్ద జాతీయ రహదారి పక్కనున్న ఒక షోరూం ఎదురుగా ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం పడి ఉన్నట్లు తాలూకా పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అతని కాలు విరిగి, తలకు తీవ్ర గాయాలై ఉన్నాయి. మృతుడి వయసు సుమారు 25 సంవత్సరాలు ఉంటుంది. 5.5 అడుగుల ఎత్తు ఉన్నాడు. నీలిరంగు జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడు. ఏదైనా వాహనం ఢీకొనడం వలన చనిపోయి ఉండవచ్చని, వాహనం ఆగకుండా వెళ్లిపోయి గుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వేగంగా వెళుతున్న వాహనం నుంచి కిందకు పడిపోయి కూడా ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసిన తర్వాత ఇక్కడకు తెచ్చి పడేసి ఉండవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. మృతదేహాన్ని ఒంగోలు జీజీహెచ్‌లోని మార్చురీకి తరలించారు. మృతుడి సమాచారం తెలిసిన వారు 9121102127, 9121104779 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఒంగోలు తాలూకా సీఐ అజయ్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment