కూటమికి బాజా!
ఎకై ్సజ్ ఖాజా..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఫక్తు రాజకీయ నాయకుడిలా ప్రసంగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. కూటమి ప్రభుత్వాన్ని పొగుడుతూ స్వామి భక్తిని చాటుకోవడమే కాకుండా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం వివాదాస్పదంగా మారింది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం నవోదయ పథకాన్ని అమలు చేసిందని, నాటుసారా నిర్మూలనకు కృషి చేసిందని, ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో సారా వినియోగం బాగా పెరిగిందని, మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని నాటుసారా రహిత రాష్ట్రంగా మార్చేందుకు నవోదయ 2.0 అమలు చేస్తున్నారని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ షేక్ ఖాజా మొహిద్దీన్ చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎకై ్సజ్ సూపరెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన స్వామి భక్తిని ప్రదర్శించే విషయంలో తొలిరోజు నుంచి వెనకాడటం లేదు. మీడియా సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును పొగడ్తలతో ముంచేయడం ఆయనకు రివాజుగా మారింది. యథాలాపంగానే మంగళవారం జిల్లా ఎకై ్సజ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కూడా అదే తీరుగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్‌లో నవోదయ 2.0 కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వివరాలు వెల్లడించేందుకు ఖాజా మొహిద్దీన్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తాను జిల్లా ఉన్నతాధికారినన్న విషయాన్ని మరచిపోయి ఒక రాజకీయ నాయకుడి తరహాలో గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఆయన ఇదే శాఖలో విధులు నిర్వహించిన సంగతి మరిచిపోయినట్టున్నారు.
రమణ వ్యవహారంలో పాత్ర?
ఒంగోలు ఎకై ్సజ్ శాఖలో రమణ చౌదరి అనే కానిస్టేబుల్ 2.34 కోట్ల రుపాయల గోల్‌మాల్‌కు పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. నగరంలోని ఎలైట్ మాల్‌లో విక్రయించిన మద్యం తాలూకు డబ్బును ఏరోజుకారోజు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. అయితే రమణ చౌదరి అనే కానిస్టేబుల్ ప్రభుత్వానికి లెక్కలు చూపకుండా రూ.2.34 కోట్లు కాజేశాడు. ఈ వ్యవహారం బయట పడకుండా ఉండేందుకు ఎలైట్ మాల్‌ను తగలబెట్టాలని ప్రయత్నించినట్లు కథనాలు వచ్చాయి. అవినీతి బట్టబయలైన తరువాత కానిస్టేబుల్ రమణ చౌదరి అధికారులకు అందుబాటులో లేకుండా పరారరయ్యాడు. అతని పరారీ వెనక కూడా ఖాజా మొహిద్దీన్ హస్తం ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఎకై ్సజ్ శాఖకు రూ.కోట్లలో కన్నం వేసిన కానిస్టేబుల్ మీద పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తిలాపాపం తలా పిడికెడు తరహాలో రమణ చౌదరి కాజేసిన డబ్బును రికవరీ పేరుతో తలా కొంత వేసుకుని చెల్లించడంతో చివరికి ఈ పరారీ కథ కంచికి చేరింది. రమణ చౌదరి కేసు వ్యవహారాన్ని మాఫీ చేసేందుకు కూటమి పెద్దల ఆశీస్సులతో ఈఎస్ ఖాజా మొహిద్దీన్ చివరి నిమిషం వరకు ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా ఒక సాధారణ కానిస్టేబుల్ కోట్ల రుపాయల నిధులను ఎలా కాజేయగలడన్న ప్రశ్నకు ఇప్పటికీ జవాబు లేదు. కూటమి పెద్దల మెప్పు కోసం ఖాజా భాయ్ ఎంతకై నా తెగిస్తారని ఆ శాఖ ఉద్యోగులే చెప్పుకుంటున్నారు.
బెల్ట్ షాపుల సంగతేంటి సార్?
రాష్ట్రంలో నాటు సారా నిర్మూలించడం సంగతి పక్కనబెడితే జిల్లాలో జోరుగా సాగుతున్న బెల్ట్ షాపులపై ఈఎస్ నోరు మెదపడడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్కారీ మద్యం దుకాణాలను ఎత్తివేసి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం తెలిసిందే. వాటికి అనుసంధానంగా ప్రస్తుతం జిల్లాలో సుమారు 2000కు పైగా బెల్ట్ షాపులు నడుస్తున్నట్లు అంచనా. ప్రతి గ్రామంలో కూటమి నేతల ఆశీస్సులతో సాగుతున్న బెల్ట్ షాపులను ఎకై ్సజ్ అధికారులు చూసీచూడనట్టు వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. భారీగా ముడుపులు పుచ్చుకొని చోద్యం చూస్తున్నట్లు ఈఎస్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నప్పటికీ జిల్లాలో మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో బెల్ట్ షాపులు నడుస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం. టీడీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో బెల్ట్ షాపు పెట్టి బహిరంగంగా మద్యం విక్రయిస్తున్నా పట్టించుకోని ఈఎస్ కూటమి నేతల భజనలో మునిగి తేలడం వివాదాస్పదంగా మారింది.
బదిలీల్లో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు
గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకై ్సజ్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. అపుడు రమణ చౌదరి అనే కానిస్టేబుల్‌తో చేతులు కలిపిన ఈఎస్ ఖాజా మొహిద్దీన్ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. చేతులు తడిపిన వారికి మాత్రమే కోరుకున్న చోట పోస్టింగు ఇచ్చినట్లు ఆ శాఖలోని ఉద్యోగులే వాపోయారు. దీంతోపాటుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. అయినా ఈయనపై వచ్చిన ఆరోపణలను కూటమి పాలకులు పట్టించుకోకపోవడం ఆరోపణకు బలం చేకూరుస్తోంది.
గత ప్రభుత్వంలో సారా విక్రయాలు ఎక్కువయ్యాయంటున్న ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఖాజా మొహిద్దీన్
బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇదే తీరు
కానిస్టేబుల్ బదిలీల్లో అవినీతి ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోని ప్రభుత్వంపై స్వామి భక్తి
సొంత శాఖలో జరిగిన రూ.2.34 కోట్ల గోల్‌మాల్‌లో ఖాజా పాత్రపై ఆరోపణలు
రమణ చౌదరిని రక్షించేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు
Comments
Please login to add a commentAdd a comment