ప్రకాశంలో బర్డ్ ఫ్లూ లేదు
● పశు సంవర్ధకశాఖ జేడీ బేబీరాణి
సంతనూతలపాడు: జిల్లాలో బర్డ్‌ఫ్లూ లేదని, ప్రజలు కోడి మాంసం, కోడిగుడ్లు తినవచ్చని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె.బేబీరాణి స్పష్టం చేశారు. మంగళవారం సంతనూతలపాడు పశువైద్యశాలలో చీమకుర్తి, సంతనూతలపాడు మండలాల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ.. ఇతర జిల్లాల నుంచి పశువుల దాణా, కోడిగుడ్లు, కోళ్లను జిల్లాకు రవాణా చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో పశుగణన సర్వే దాదాపుగా పూర్తయినట్టు చెప్పారు. ఇప్పటికే కోళ్ల ఫామ్ యజమానులకు బర్డ్ ఫ్లూపై అవగాహన కల్పించి, కోళ్లకు వ్యాక్సిన్ కూడా వేశామన్నారు. వ్యర్థాల తొలగింపునకు కూడా ప్రత్యేక సూచనలిచ్చామన్నారు. సమావేశంలో ఏడీ డాక్టర్ కె.సుధీర్ బాబు, పశు వైద్యాధికారులు టి.మనురూప్, వై.పేరయ్య, పి.చిరంజీవి, బి ప్రతాపరెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment