కంభంలో ఇరువర్గాల ఘర్షణ
కంభం: ఇరువర్గాల మధ్య ఘర్షణలో నలుగురికి గాయాలైన సంఘటన మంగళవారం రాత్రి కంభంలోని తెలుగు వీధిలో చోటుచేసుకుంది. వివరాలు.. తెలుగు వీధిలో నివాసం ఉంటున్న వారు మంగళవారం ఉదయం దేవరకు పెట్టుకున్నారు. అక్కడి పరిణామాలపై మాటామాటా పెరగడంతో ఘర్షణ చోటుచేసుకుంది. సత్యలింగమూర్తి అనే వ్యక్తికి తలకు గాయాలు కాగా అరుణ్‌కుమార్, ప్రసాద్, మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. ఘర్షణ అనంతరం ఓ వర్గం వారు అక్కడ ఉన్న కొస్టానికి నిప్పంటించగా చుట్టుపక్కల వారు నీళ్లు పోసి ఆర్పేశారు. తలకు గాయమైన లింగమూర్తిని మార్కాపురం వైద్యశాలకు తరలించారు. వీధిలో ఓ ఏఎస్సై, ఇద్దరు సిబ్బంది పహరా కాస్తున్నారు. ఘర్షణకు దిగిన ఇరువర్గాల వారు టీడీపీ సానుభూతిపరులేనని తెలిసింది. ఈ విషయమై ఎస్సై నరసింహారావును వివరణ కోరగా గొడవకు సంబంధించి బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment