వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా రమణారెడ్డి
ఒంగోలు సిటీ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా మార్కాపురం నియోజకవర్గానికి చెందిన కేవీ రమణారెడ్డిని నియమించారు. ఆ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ బదిలీ
గిద్దలూరు(బేస్తవారిపేట): గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ డి.వెంకటదాసు నంద్యాల మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గిద్దలూరు నగర పంచాయతీ నూతన కమిషనర్‌గా ఐ.శ్రీనివాసులు నియమించారు. గుడివాడ మున్సిపాలిటీ మేనేజర్‌గా పనిచేస్తున్న ఈయన పదోన్నతిపై గిద్దలూరులో నియమితులయ్యారు.
క్యాథ్‌ల్యాబ్‌ను త్వరగా ప్రారంభించాలి
ఒంగోలు టౌన్: జిల్లాలో రోజురోజుకూ గుండె జబ్బులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో గత ప్రభుత్వం క్యాథ్ ల్యాబ్ మంజూరు చేసిందని, ప్రస్తుతం ల్యాబ్ ఏర్పాటు పూర్తయిన దృష్ట్యా సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిళ్లా చెన్నయ్య కోరారు. ఈమేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టి.కృష్ణబాబును కలిసి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఇటీవల నిరుపేద ప్రజలు ఎక్కువగా గుండెజబ్బుల బారిన పడుతున్నారని, చికిత్స కోసం కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment