ఒంగోలు వన్‌టౌన్: తపాలా జీవిత బీమా మెగా మేళాను బుధ, గురువారాలు నిర్వహిస్తున్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ప్రకాశం డివిజన్ ఒంగోలు ఎండీ జాఫర్ సాధిక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెయ్యి మందికి నూతనంగా తపాలా జీవిత బీమా కవరేజ్ అందించాలని లక్ష్యాలను నిర్దేశించినట్లు చెప్పారు. 1 కోటి రూపాయల ప్రీమియం సమీకరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పోస్టాఫీసులో జీవిత బీమా వలన తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్‌లతో కూడిన పాలసీలను పొందవచ్చన్నారు. గ్రామీణ తపాల బీమాను గ్రామీణ ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. గతంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితమైన పోస్టాఫీసు బీమా, ప్రస్తుతం పట్టభద్రులందరికీ డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ వారికి కుడా అందుబాటులోకి వచ్చిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment