● ఏడుగురికి స్వల్ప గాయాలు
జరుబులవారిపాలెం (కారంచేడు): రోడ్డు పక్కన ఆగి ఉన్న స్కూల్ బస్సును కూలీలతో వస్తున్న ఆటో ఢీకొట్టడంతో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన కారంచేడు మండలంలోని జరుబులవారిపాలెం నుంచి ఇంకొల్లు వెళ్లే మార్గంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై వి.వెంకట్రావు కథనం మేరకు.. ఇంకొల్లుకు చెందిన ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు విద్యార్థుల కోసం కేశవరప్పాడు వచ్చి వెళ్తోంది. ఈ సమయంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న బస్సును వ్యవసాయ కూలీలతో ఇంకొల్లు నుంచి కేశవరప్పాడు వస్తున్న ఆటో ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆటో పొలాల్లోకి దూసుకెళ్లగా కూలీల్లో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చీరాల ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా స్థానికులు మాత్రం ఆటోను స్కూల్ బస్సు వచ్చి ఢీకొట్టిందని చెబుతున్నారు. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఎస్సై చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment