స్మార్ట్ మీటర్లు రావన్నారు.. ఇప్పుడు బిగిస్తున్నారు
మా యూనియన్ నాయకులు మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చినప్పుడు స్మార్ట్ మీటర్లు రావని చెప్పారు. ఇప్పుడేమో అవే మీటర్లు బిగించేస్తున్నారు. అవి పూర్తయిన తర్వాత మా ఉద్యోగాలు ఉంటాయో లేదో అర్థం కావడం లేదు. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.
– సయ్యద్ హుస్సేన్, మీటర్ రీడర్స్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్
ఉద్యోగ భద్రత కల్పించాలి
నేను 18 ఏళ్లుగా మీటర్ రీడర్‌గా పనిచేస్తున్నా. ఇప్పుడు ఉద్యోగాలు ఉంటాయో పోతాయో అర్థం కావడం లేదు. ఒక వేళ తొలగించాల్సి వస్తే మాకు ప్రత్యామ్నాయంగా విద్యుత్ శాఖలో లేదా ఇతర శాఖల్లో ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలి.
– కె.సురేంద్రబాబు,
మీటర్ రీడర్ కంభం
స్మార్ట్ మీటర్లు రావన్నారు.. ఇప్పుడు బిగిస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment