40 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
కొండపి: అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొండపి ఎస్సై ప్రేమ్ కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని తాటాకులపాలెం గ్రామంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు గ్రామ శివారులో తనిఖీ చేపట్టారు. మినీ ట్రక్‌లో అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వట్టికొండ బంగారయ్య, గరితోటి అశోక్‌ను అదుపులోకి తీసుకుని, వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment