● ఏపీ టీచర్స్ గిల్డ్ డిమాండ్
ఒంగోలు సిటీ: జిల్లా వ్యాప్తంగా ఉన్న 40 సింగిల్ ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్లు సెలవు పెడితే సీఆర్పీలను కేటాయించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్ ప్రభాకరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సింగిల్ ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ సెలవు పెడితే ఆ పాఠశాలకు కొంత మంది మండల విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయులను, సీఆర్పీలను పంపకపోవడాన్ని తప్పుబట్టారు. సెలవు పెట్టిన టీచర్లే ప్రైవేట్ టీచరును ఏర్పాటు చేసుకోవాలని ఎంఈఓలు చెప్పడం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సెలవు పెడితే.. ఇద్దరు ఎయిడెడ్ టీచర్లు ఉన్న స్కూళ్ల నుంచి పంపుతున్నారు కానీ ఎయిడెడ్ స్కూళ్లలో టీచరు సెలవు పెడితే ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు. డీఈఓ స్పందించి ఎయిడెడ్ స్కూళ్లకు సీఆర్పీలను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment