యర్రగొండపాలెం: అడవిలో ఉచ్చులు బిగించి జంతువులను వేటాడే వారిపై ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ నెల 15వ తేదీన మండలంలోని కొలుకుల బీట్ పరిధిలోని అటవీ ప్రాంతంలో అడవి పందుల కోసం ఉచ్చు బిగించారు. ఈ ఉచ్చులో చిక్కుకొని చిరుతపులి మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఈ కేసును ముమ్మరం చేసిన ఫారెస్ట్ అధికారులు బుధవారం నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అనుమానితులైన కొలుకులకు చెందిన ఇద్దరు, చెన్నరాయునిపల్లెకు చెందిన మరో ఇద్దరిపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఆ శాఖకు చెందిన ఒక అధికారి తెలిపారు. కేసు విచారణ పూర్తయిన అనంతరం ఆ నలుగురు అనుమానితులను అరెస్ట్ చేయనున్నట్లు తెలిసింది. అందుకు ఫారెస్ట్ అధికారులు స్థానిక సీఐ సీహెచ్ ప్రభాకరరావు సహకారాన్ని కోరినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment