కృష్ణం వందే జగద్గురుం
తర్లుపాడు: అశేష భక్తజనం భక్తిపారవశ్యంతో శ్రీకృష్ణ నామాన్ని స్మరిస్తుండగా వేణుగోపాలుడు ఉభయ దేవేరులతో కలిసి రథంపై ఊరేగాడు. తర్లుపాడులోని రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఉభయ దేవేరులతో కలిపి స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన రథంపై అర్చకులు ప్రతిష్ఠించి పూజలు చేశారు. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పొదిలి సీఐతో పాటు తర్లుపాడు ఎస్సై బ్రహ్మనాయుడు ఇంకా పలువురు ఎస్సైలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త జవ్వాజి విజయభాస్కర్, గ్రామ ప్రముఖులతోపాటు ఈఓ చెన్నకేశవరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. దాతల ఆధ్వర్యంలో భక్తులకు అన్న సంతర్పణ చేయడంతోపాటు మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు, పానకం, వడపప్పు పంపిణీ చేశారు.
వైభవంగా వేణుగోపాలుని రథోత్సవం
భక్తుల శరుణుఘోషతో మారుమోగిన తర్లుపాడు వీధులు
కృష్ణం వందే జగద్గురుం
కృష్ణం వందే జగద్గురుం
Comments
Please login to add a commentAdd a comment