ఓ పక్క నవోదయం.. మరో పక్క తాగి పొర్లుదాం!
కొమరోలు: జిల్లా కేంద్రమైన ఒంగోలులో రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సాంఘిక సంక్షేమ శాఖమంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి నవోదయం 2.0 కార్యక్రమాన్ని గొప్పలు చెప్పుకుంటూ మరీ బుధవారం ప్రారంభించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ గొప్పలు అతిగా అనిపిస్తున్నాయి. మండల కేంద్రమైన కొమరోలులో బుధవారం నడిరోడ్డుపైన ఓ వ్యక్తి బెల్టు షాపులో మద్యం సేవించి స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు. కొమరోలులో బెల్టుషాపుల్లో మద్యం ఏరులై పారుతోంది అనడానికి ఈ చిత్రమే నిదర్శనం. కొమరోలులోని బ్రహ్మంగారిమఠం వీధికి వెళ్లే రహదారిలో పూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి సోయ లేకుండా పడి ఉన్నాడు. రోజూ ఈ ప్రాంతంలో రాష్ట్రీయ రహదారిపై ఉన్న మద్యం దుకాణాలు లేదా బెల్టు షాపుల్లో మద్యం కొనుగోలు చేస్తున్న వారు వీధిలోని చెట్ల కింద తాగుతూ దొర్లుతూ కాలక్షేపం చేస్తున్నారు. అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు, పోలీసులు పట్టీపట్టనట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. బ్రహ్మంగారిమఠంకు వెళ్లే రహదారిలో రోజూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తుంటాయి. స్థానికంగా ఉండే మహిళలు మందుబాబుల ఆగడాలకు భయపడుతూ అలాగే తమ పనులకు వెళ్తున్నారు. నవోదయం 2.0ను అట్టహాసంగా ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం దానికి తగినట్లుగా చర్యలు తీసుకుని కొమరోలులో, చుట్టుపక్కల దుకాణాలలో బెల్టుషాపులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment