
రైస్ పుల్లింగ్ పేరుతో మోసం
బేస్తవారిపేట: రైస్ పుల్లింగ్ పేరుతో మోసానికి పాల్పడిన వ్యవహారం గురువారం వెలుగులోకి రాగా అందులో ముగ్గురు అటవీశాఖ సిబ్బంది పాత్ర ఉన్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల కథనం మేరకు.. మార్కాపురం మండలం వేములకోటకు చెందిన డి.సాయికుమార్‌కు స్నేహితుడు కిషోర్, అంబులెన్స్ డ్రైవర్ రాజేష్ బేస్తవారిపేటలోని ఓ వ్యక్తి వద్ద రైస్ పుల్లింగ్ యంత్రం(బియ్యాన్ని ఆకర్షించే శఠగోపం లాంటి వస్తువు) ఉందని చెప్పారు. ఈ విషయమై బేస్తవారిపేటకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తిని కుంట వద్దకు పిలిపించి సెల్‌ఫోన్‌లో రైస్ పుల్లింగ్‌ను చూపించాడు. రూ.3 లక్షల నగదు తీసుకొస్తే కొనుగోలు చేయవచ్చని కిషోర్, అతని స్నేహితులు చెప్పారు. దీంతో సాయికుమార్ తన స్నేహితుడైన తర్లుపాడుకు చెందిన కారు డ్రైవర్ మల్లికార్జున్‌ను నగదు అడిగాడు. వేరే వాళ్ల వద్ద బంగారం ఉంది, నీకు రూ.3 లక్షలకు అదనంగా రెండు లక్షల వరకు ఇస్తానని చెప్పాడు. రైస్ పుల్లింగ్ విషయాన్ని సాయికుమార్ తన బంధువైన కనిగిరికి చెందిన రామకృష్ణకు చెప్పాడు. కోట్ల ధరకు అమ్మవచ్చని హైదరాబాద్ నుంచి ఇద్దరు వ్యక్తులను పిలిపించాడు.
రూ.2.80 లక్షల నగదు కారులో పెట్టుకుని సాయికుమార్, మల్లికార్జున్, కిషోర్, కనిగిరికి చెందిన రామకృష్ణ, హైదరాబాద్ వ్యక్తులు బేస్తవారిపేటలోని పందిళ్లపల్లె టోల్‌ప్లాజా వద్దకు వచ్చారు. జగనన్న లేఔట్ రోడ్డు చివరికి వెళ్లిన తర్వాత రైస్ పుల్లింగ్ ఉందని చెప్పిన బేస్తవారిపేటకు చెందిన రామకృష్ణ అక్కడికి రాలేదు. కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఇద్దరు గరికపాటి శ్రీనివాసులు, జక్కం శ్రీనివాసులు, గరికపాటి శ్రీనివాసులు కుమారుడు రవి, డ్రైవర్ లేఔట్ వద్దకు వచ్చారు. కారులో వెతుకులాడి రూ.2.80 లక్షల నగదు తీసుకున్నారు. కనిగిరి, హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తులను బెదిరించి మల్లికార్జున్ సెల్‌ఫోన్‌కు రూ.48 వేలు ఫోన్ పే చేయించారు. మరళా రూ.48 వేలను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చెప్పిన నంబర్‌కు ఫోన్ పే చేయించుకున్నారు. అక్కడికి వచ్చిన వారిని బెదిరించి వీడియోలు తీసుకుని, ఎవరికై నా చెబితే కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తామని హెచ్చరించారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు కంభం సీఐ కే మల్లికార్జున్, బేస్తవారిపేట ఎస్సై ఎస్‌వీ రవీంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు.
ముగ్గురు అటవీ శాఖ బీట్ ఆఫీసర్ల పాత్ర!
రూ.2.80 లక్షల నగదు, రూ.48 వేలు
ఫోన్ పే నగదు దోచుకున్నట్లు ఆరోపణ
బేస్తవారిపేట మండలంలోని పందిళ్లపల్లె
టోల్ ప్లాజా వద్ద సంఘటన
పోలీసులను ఆశ్రయించి గోడు వెళ్లబోసుకున్న బాధితులు

రైస్ పుల్లింగ్ పేరుతో మోసం

రైస్ పుల్లింగ్ పేరుతో మోసం
Comments
Please login to add a commentAdd a comment