
బైకును ఢీకొట్టిన కారు
● ప్రమాదంలో ఒకరు మృతి
● అదుపుతప్పి బోల్తా పడిన కారు
పామూరు: జాతీయ రహదారిపై బైక్ మీద వెళ్తూ ఓ చోట మలుపు తిరుగుతున్న వ్యక్తిని తప్పించబోయి ఎదురుగా వస్తున్న కారు బోల్తా కొట్టింది. ఈ క్రమంలో బైక్‌ను కారు బలంగా ఢీకొట్టడంతో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన పామూరు మండలంలోని నుచ్చుపొద సమీపంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. మండలంలోని లక్ష్మీనరసాపురం గ్రామానికి చెందిన బేల్దారీ కూలీ వేముల నివాస్(44) పామూరులో సొంత పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. నుచ్చుపొద సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న పెట్రోల్‌బంక్‌వైపు బైక్‌ను తిప్పాడు. అదే సమయంలో కందుకూరు నుంచి పామూరు వస్తున్న కారు నివాస్ బైక్‌ను తప్పించబోయి బలంగా ఢీకొట్టింది. నివాస్ తలకు గాయాలై రోడ్డుపై పడగా స్థానికులు ఓ ఆటోలో పామూరులోని కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు. అప్పటికే నివాస్ మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. కాగా, కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. అందులోని వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఘటనా స్థలాన్ని సీఐ ఎం.భీమానాయక్ పరిశీలించారు. మృతునికి భార్య సుజాత, ఇరువురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భార్య సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ పి.దాసు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి వైద్యశాలకు తరలించారు. భర్త మృతితో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా మృతుడు హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలతో బయటపడి ఉండేవాడని స్థానికులు చర్చించుకున్నారు.

బైకును ఢీకొట్టిన కారు

బైకును ఢీకొట్టిన కారు
Comments
Please login to add a commentAdd a comment