వణికిస్తున్న విషజ్వరాలు
ముండ్లమూరు(కురిచేడు): మండలంలోని అగ్రహారం, నూజిళ్లపల్లి గ్రామాల ప్రజలు విషజ్వరాలతో మంచంపట్టారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో దోమలు, వైరస్‌లు విజృంభిస్తున్నాయి. వాటి వలన విషజ్వరాలు, మలేరియా, చికున్‌గున్యా లాంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రభుత్వ వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడంతో జ్వరపీడితులు సూదిమందు వేసే దిక్కులేక ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. జ్వరం, ఒళ్లునొప్పులతో నడవలేని స్థితిలో ప్రజలున్నా వైద్యాధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలుతున్నా పంచాయతీ సిబ్బంది డ్రైనేజిలను శుభ్రం చేయకుండా, దోమల మందు కొట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు అద్దంకి, దర్శి లాంటి పట్టణాలకు వెళ్లి ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్సలు పొందుతున్నారు. వేలకు వేలు ఖర్చు చేసుకుని ఇల్లు వదిలిపోయి ఆస్పత్రుల పాలవుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు ఇంటింటికీ వలంటీర్లు, వైద్యసిబ్బంది వచ్చి జ్వరపీడితులను గుర్తించేందుకు సర్వే చేసేవారు. వారికి అవసరమైన వైద్యచికిత్సలు ఇళ్ల వద్దే అందించేవారు. కానీ ఇప్పుడు పట్టించుకునేవారే కరువయ్యారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ వైద్యాధికారులు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి జ్వర పీడితులను గుర్తించి వైద్యచికిత్సలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
ముద్ద మింగుడు పడలేదా?
● సింగరాయకొండ జెడ్పీ స్కూల్లో హోటల్ భోజనం తిన్న డీవైఈఓ చంద్రమౌళీశ్వరరావు
● మధ్యాహ్న భోజనం రుచి చూసి హోటల్ ఫుడ్ తినడంపై విస్మయం
సింగరాయకొండ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద నాణ్యమైన ఆహారం అందిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం చెబుతున్న మాటలు డొల్లేనని జిల్లాలో వరుసగా బయటపడుతున్న సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. పెద్దదోర్నాలలోని ఏపీ మోడల్ స్కూల్లో అసలు మెనూ అమలు చేయని వైనం తెలిసిందే. తాజాగా శుక్రవారం సింగరాయకొండలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న జెడ్పీ హైస్కూల్లో భోజనం బాగోలేదన్న విషయం ఒంగోలు డీవైఈఓ చంద్రమౌళీశ్వరరావు చర్యతో బయటపడింది. మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి, ఎలా ఉందని విద్యార్థులను ప్రశ్నించిన డీవైఈఓ.. కాసేపటి తర్వాత హోటల్ నుంచి తెప్పించిన భోజనాన్ని పాఠశాలలోనే తాపీగా భుజించారు. ఇదంతా చూసిన విద్యార్థులు.. శ్రీఔరా మనకేమో ఈ చప్పిడి కూడు, సారుకేమో హోటల్ ఫుడ్డుశ్రీ అని చర్చించుకున్నారు. ఈ విషయం ఆనోటా ఈనోటా బయటకు పొక్కడంతో మధ్నాహ్న భోజన పథకం నిర్వహణపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. హోటల్ ఫుడ్డు తిన్న డీవైఈఓ.. పాఠశాలలో భోజనం బాగుందని కితాబివ్వడం గమనార్హం.
జీజీహెచ్‌లో ఆధార్ నమోదు కేంద్రం
ఒంగోలు టౌన్: జనన మరణాల ధ్రువీకరణ పత్రాలను వందేళ్ల వరకు భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉప సంచాలకులు ఎం.శ్రీనివాసులు రెడ్డి ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన శిశు ఆధార్ నమోదు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ సీఎస్సీ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో పుట్టిన వెంటనే శిశు ఆధార్ నమోదు చేయాలని సూచించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేరోజునే తల్లిదండ్రులకు బిడ్డ జనన ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలన్నారు. శిశు ఆధార్ తో పాటుగా అభా ఐడీ ఇవ్వాలని చెప్పారు. జనన మరణ ధ్రువీకరణ పత్రాల్లో తప్పులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓ డాక్టర్ మాధవీ లత, జిల్లా స్టాటిస్టికల్ అధికారి ప్రసాదరావు, నర్సింగ్ సూపరింటెండెంట్ అనంత లక్ష్మి, మెడికల్ రికార్డు టెక్నీషియన్ శ్రీనివాస రావు, సీఎస్సీ జిల్లా మేనేజర్ ప్రమోద్ పాల్గొన్నారు.
మంచంపట్టిన 2 గ్రామాలు సూదిమందుకూ దిక్కు లేదు
వణికిస్తున్న విషజ్వరాలు
వణికిస్తున్న విషజ్వరాలు
వణికిస్తున్న విషజ్వరాలు
Comments
Please login to add a commentAdd a comment