మోడల్ స్కూల్లో ఎంఈఓ విచారణ
పెద్దదోర్నాల: మండల పరిధిలోని మోట్ల మల్లికార్జునపురంలో ఏపీ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఎంఈఓ మస్తాన్‌నాయక్ శుక్రవారం విచారణ చేపట్టారు. పాఠశాలలో మెనూ అమలు చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్న వైనంపై ‘ఇదేంది సారూ.. రోజూ పప్పుచారు’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఎంఈఓ స్పందించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మెనూ అమలు తీరుపై ఆరా తీశారు. విద్యార్థులు చెప్పిన విషయాలతోపాటు ప్రిన్సిపాల్ వివరణను డీఈఓకు పంపినట్లు ఎంఈఓ పేర్కొన్నారు.
పోక్సో కేసు నమోదు
కొండపి: కొండపి పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు చేసినట్లు కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ శుక్రవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కొండపి మండలంలోని బాధితురాలైన ఓ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తులో సేకరించిన ఆధారాలను బట్టి నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. సమావేశంలో ఎస్సై ప్రేమ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
సినిమా థియేటర్ సీజ్
మద్దిపాడు: మండల పరిధిలోని ఓ సినిమా థియేటర్‌ను శుక్రవారం ఉదయం తహసీల్దార్ సుజన్ కుమార్ తన సిబ్బందితో కలిసి సీజ్ చేశారు. అందిన వివరాల ప్రకారం.. వెల్లంపల్లి గ్రామంలో గత కొంతకాలంగా జీఎంఆర్ సినిమా హాల్ నిర్వహిస్తున్నారు. గతంలో రైస్ మిల్లుగా నిర్వహిస్తున్న కట్టడాన్ని ఎటువంటి బదలాయింపు లేకుండా సినిమా హాలుగా మార్పు చేశారని జేసీ గోపాలకృష్ణకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో జేసీ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు థియేటర్‌ను సీజ్ చేశారు. తనిఖీలో డిప్యూటీ తహసీల్దార్ అజయ్‌కుమార్ రెడ్డి, ఆర్‌ఐ రమణయ్య, వీఆర్వో పూజిత, మహిళా పోలీస్ అనూష తదితరులు పాల్గొన్నారు.
వీఓఏ రూ.22 లక్షలు నొక్కేసింది
● ఏపీఎంకు బింగినపల్లి డ్వాక్రా
మహిళల ఫిర్యాదు
సింగరాయకొండ: మండలంలోని బింగినపల్లి గ్రామానికి చెందిన వీఓఏ ఈశ్వరి సుమారు రూ.17 లక్షల డ్వాక్రా సంఘం నిధులు, రూ.5 లక్షల సీ్త్ర నిధి నగదు స్వాహా చేసిందని గంగమ్మ డ్వాక్రా గ్రూప్ మహిళలు ఏపీఎం భాగ్యలక్ష్మికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఆమైపె విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేస్తానని ఏపీఎం భరోసా ఇచ్చారు.
మోడల్ స్కూల్లో ఎంఈఓ విచారణ
మోడల్ స్కూల్లో ఎంఈఓ విచారణ
మోడల్ స్కూల్లో ఎంఈఓ విచారణ
Comments
Please login to add a commentAdd a comment