మూడు కేజీల గంజాయి పట్టివేత
గిద్దలూరు(బేస్తవారిపేట): గిద్దలూరు అర్బన్ కాలనీలో గంజాయి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. శుక్రవారం స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ వెల్లడించారు. గిద్దలూరు ఎస్టీ కాలనీలో గత కొన్ని రోజులుగా గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో పోలీసులు నిఘా ఉంచారు. కావడి అశోక్ ఆధ్వర్యంలో 10 గ్రాముల గంజాయి రూ.500 ప్రకారం అమ్ముతున్నట్లు గుర్తించారు. అతనితోపాటతు తెలంగాణకు చెందిన మరో ఇద్దరు కె.రోహిత్, ఎస్.మురళీకృష్ణ అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మూడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. తెలంగాణ వ్యక్తులు గత కొంతకాలంగా విశాఖపట్నం నుంచి గిద్దలూరుకు గంజాయి తరలించి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. డ్రోన్ కెమెరాలతో నిఘా వ్యవస్థను పటిష్టపరుస్తామన్నారు. సమావేశంలో గిద్దలూరు సీఐ సురేష్, రూరల్ ఎస్సై రామకోటయ్య పాల్గొన్నారు.
సిసోడియాకు కలెక్టర్ స్వాగతం
ఒంగోలు సిటీ: రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియాకు ఒంగోలు నగరంలోని ఓ హోటల్‌లో కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, డీఆర్‌ఓ చినఓబులేసు, ఒంగోలు ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న పుష్పగుచ్చాలతో శుక్రవారం స్వాగతం పలికారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీల పరిష్కారం, రీసర్వే జరుగుతున్న తీరుపై శనివారం సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్లతో సిసోడియా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు.
మూడు కేజీల గంజాయి పట్టివేత
Comments
Please login to add a commentAdd a comment