ఆదివాసీలపై మారణకాండ ఆపాలి
ఒంగోలు టౌన్: అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టే లక్ష్యంతో మధ్య భారత దేశంలోని ఆదివాసీలపై కొనసాగిస్తున్న మారణ హోమాన్ని ఆపాలని, తక్షణమే కాగర్ ఆపరేషన్‌ను నిలిపి వేయాలని వామపక్షాలు, విప్లవ, దళిత హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి. శుక్రవారం సీపీఐ నాయకుడు కె.వీరారెడ్డి అధ్యక్షత కలెక్టరెట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దండకారణ్యంలో విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లకు దోచి పెట్టడాన్ని, ఆదివాసీలను నిర్వాసితులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రశ్నించే గొంతులపై అర్బన్ నక్సలైట్ ముద్రలు వేసి కేసులు పెట్టి అణచి వేసే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆదివాశీల మీద దాడులు ఎక్కువయ్యాయన్నారు. దేశ సంపదను అదాని, అంబానీలకు కట్టబెట్టే కుట్రలను ప్రజలందరూ తిప్పి కొట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జీవీ కొండారెడ్డి పిలుపునిచ్చారు. సభలో బి.పద్మ, చుండూరి రంగారావు, నాంచార్లు, మోహన్, సుధాకర్, క్రాంతి, నరసింహరావు, కోటి, ప్రకాశరావు, రాజ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment