రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
● పొలాల్లోకి పల్టీలు కొట్టిన కారు
బేస్తవారిపేట: మండలంలోని కలగొట్ల సమీపంలో ఒంగోలు–నంద్యాల హైవేపై కారు అదుపుతప్పి పల్టీలు కొట్టిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోరుమామిళ్లకు చెందిన పశువైద్యాధికారి ఆదిత్య, భార్య సాయిసౌజన్య, పిల్లలు హర్షణ్, రాజీ తమ కారులో దర్శిలో జరుగుతున్న బంధువుల వివాహానికి హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో ఉన్న వీరి కారు కలగొట్ల వద్ద రోడ్డుపై లోతైన గుంతలను తప్పించే క్రమంలో అదుపుతప్పి పల్టీలు కొట్టుకుంటూ పొలంలో పడింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఉపాధ్యాయుడు మధుసూదన్‌రెడ్డి కారు ప్రమాదాన్ని గమనించారు. క్షతగాత్రులను బేస్తవారిపేటలోని ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. హర్షణ్ ముక్కు వద్ద లోతైన గాయమైంది, మిగిలిన ముగ్గురుకి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment