
యువకుడి మృతదేహం లభ్యం
దర్శి(కురిచేడు): నాగార్జున సాగర్ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ పుప్పాల వీరనారాయణ(17) మృతదేహం లభ్యమైంది. సాగర్ కాలువలో పొదిలి రోడ్డులోని విద్యుత్ తయారీ కేంద్రం సమీపంలో మృతదేహం గోడకు తగిలి నిలిచిపోయింది. కాగా శనివారం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన ఎస్సై మురళి తనసిబ్బందితో కాలువపై గాలింపు చేస్తుండగా ఆదివారం మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని వెలికితీసి పంచనామా చేసి పోస్టుమార్టం అనంతరం మృతునికుటుంబ సభ్యులకు అప్పగించారు. వీరనారాయణ మృతికి కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ద్విచక్రవాహనం
అదుపుతప్పి వ్యక్తి మృతి
యర్రగొండపాలెం: ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన స్థానిక ఫారెస్ట్ ఆఫీస్‌కు సమీపంలో ఆదివారం జరిగింది. పుల్లలచెరువు మండలంలోని కొమరోలుకు చెందిన పి.గురువయ్య(28) పనుల నిమిత్తం మోటారు బైక్‌పై యర్రగొండపాలెం వచ్చాడు. అక్కడ పనులు ముంగించుకొని తిరిగి స్వగ్రామం వెళ్తున్న సమయంలో హైవే రోడ్డుపై ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. వారిని తప్పించే క్రమంలో ప్రమాదవశాత్తు బైక్ బోల్తా పడింది. తీవ్రగాయాలతో ఉన్న గురవయ్యను 108అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే గురవయ్య మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పి.చౌడయ్య తెలిపారు.
25 నుంచి రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలు
పొదిలి: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు శ్రీకృష్ణ దేవరాయ సాంస్కృతిక సంస్థ చైర్మన్ శ్రావణి వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక దర్శి రోడ్డులోని ఆర్టీసీ స్థలంలో పోటీలు నిర్వహించేందుకు అవసరమైన గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు. ఈ పనులను పరిశీలించిన శ్రావణి వెంకటేశ్వర్లు ఆదివారం పోటీల వివరాలను గురించి వెల్లడించారు. శివరాత్రి రోజున రాత్రి జబర్దస్త్ నటులు, ఢీ జోడీ విన్నర్స్‌తో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆవుల పాపారావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ చెరుకూరి పుల్లయ్య, సింగంశెట్టి శివ, పయ్యావుల గురవయ్య, పాతాలపు కిశోర్, పాశం కొండయ్య, సిరిగిరి కళ్యాణ్, గుద్దెటి కాలయ్య, జూలేరు బూసిరెడ్డి పాల్గొన్నారు.

యువకుడి మృతదేహం లభ్యం
Comments
Please login to add a commentAdd a comment