ఆదర్శ పాఠశాలపై ఫిర్యాదుల పరంపర
కనిగిరిరూరల్: ‘సార్..మధ్యాహ్న భోజనం ఏం బాగాలేదు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. తీవ్ర అవస్థలతో చదువుకుంటున్నాం..’ అంటూ కనిగిరి ఆదర్శ పాఠశాల విద్యార్థులు డీఈఓ కిరణ్‌కుమార్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. కనిగిరి ఆదర్శ పాఠశాలను డీఈఓ కిరణ్‌కుమార్ ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, హాజరుపట్టిని ఆయన పరిశీలించారు. డిసెంబర్‌లో ప్రిన్సిపాల్‌గా విధుల్లో చేరిన నాటి నుంచి సక్రమంగా పాఠశాలకు రాకుండా..ఎటువంటి అనుమతులు లేకుండా విధులకు డుమ్మా కొడుతున్నట్లు గుర్తించిన డీఈఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో బోధనేతర సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, విద్యార్థులు క్రమశిక్షణ తప్పి గొడవలకు దిగుతున్నారని.. ఇప్పటికీ ఎన్నోసార్లు ఇంటర్, పదో తరగతి విద్యార్థుల మధ్య వివాదాలు జరిగాయని, బాలురు..బాలికల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని పాఠశాల ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్ పందిటి మోహన్, మాజీ చైర్మన్ గోపిశెట్టి చెన్నారావు డీఈఓకు ఫిర్యాదు చేశారు. అనంతరం డీఈఓ మోడల్ స్కూల్‌లోని విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. వసతి గృహంలో భోజనం సక్రమంగా లేదని విద్యార్థులు విన్నవించారు. దీంతో కుకింగ్ సిబ్బందిని పిలిచి మాట్లాడి భోజనం మెనూ ప్రకారం ఎందుకు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం, అలసత్వంపై ఉన్నతాధికారులకు నివేదికిస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ డీఈఓలు చంద్రమౌళేశ్వరరావు, ఆర్ శామ్యుల్ జాన్, ఎంఈఓల సంఘ అధ్యక్షుడు దేవిరెడ్డి రామిరెడ్డి, ఎంఈఓలు రాజాల కొండారెడ్డి, యువీ నారాయణరెడ్డి, జి.సంజీవి, ఆర్ శ్రీనివాసులు, బి.నరసింహారావు, రంగయ్య, ఎం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజనం బాగా లేదని డీఈఓకు విద్యార్థుల ఫిర్యాదు
ప్రిన్సిపాల్, బోధనేతర సిబ్బంది నిర్లక్ష్యంపై ఎస్‌ఎంసీ చైర్మన్ ఫిర్యాదు
కనిగిరి ఆదర్శ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన డీఈఓ
విధులకు డుమ్మాకొట్టిన ప్రిన్సిపాల్‌పై డీఈఓ ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment