
క్రీడలతో మానసిక ఉల్లాసం
● నెహ్రూ యువ కేంద్రం
జిల్లా కో ఆర్డినేటర్ కమల్‌సా
ఒంగోలు: క్రీడలతో మానసిక దృఢత్వం లభిస్తుందని నెహ్రూ యువకేంద్రం జిల్లా కో ఆర్డినేటర్ కమల్‌సా అన్నారు. స్థానిక డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాస్థాయి వాలీబాల్, కబడ్డీ, పరుగు పోటీలను ఆయన ప్రారంభించారు. తొలుత పోటీలను బ్లాక్ లెవల్‌లో జిల్లాలో నిర్వహించామని, అక్కడ విజేతలైన వారు క్లస్టర్ లెవల్ పోటీలు నిర్వహించామని, క్లస్టర్ లెవల్ విజేతలకు జిల్లాస్థాయి పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ శారీరక, మానసికంగా బలీయంగా ఉండి దేశానికి యువ శక్తిని గ్రామ స్థాయి నుంచి అందించాలనే సంకల్పంతో పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్టెప్ మేనేజర్ శ్రీమన్నారాయణ మాట్లాడుతూ నెహ్రూ యువకేంద్రం యువత ఆధారంగా కార్యక్రమాలు నిర్వహించడం, వాటికి లభిస్తున్న స్పందన అద్భుతమన్నారు. ప్రతి ఒక్కరూ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజేతలుగా గుర్తింపు పొందాలన్నారు. కబడ్డీ విజేత ఆర్జీయూ కేటీ, వాలీబాల్ విజేత ఒంగోలు క్విజ్ కాలేజీ జట్లకు, పరుగుపందెం విజేతలకు బహుమతులు, ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

క్రీడలతో మానసిక ఉల్లాసం
Comments
Please login to add a commentAdd a comment