రైల్వే ప్లాట్‌ఫాంపై గుర్తుతెలియని మృతి
ఒంగోలు టౌన్: ఒంగోలు రైల్వే స్టేషన్లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటల ప్రాంతంలో ఒకటో నంబర్ ప్లాట్ ఫాం దిగువ లైన్లో సుమారు 60 ఏళ్ల వయసున్న వ్యక్తి మరణించారు. ఫుల్ హ్యాండ్ షర్ట్, గల్ల లుంగీ ధరించి వున్నాడు. మృతుడు ఒంగోలు పరిసరాలు, తిరుపతి, మంగళగిరి ప్రాంతాలకు చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు.
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
మార్కాపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని బొడిచర్ల గ్రామ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..బొడిచర్ల గ్రామానికి చెందిన బండి సునీల్(21) కంభం వైపుకు వెళ్తుండగా బొలెరో వాహనం ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుని తల్లి మరియమ్మ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై అంకమరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment