ప్రజల కోసం నిలబడతాం.. కలబడతాం
ఒంగోలు సిటీ:
ఎన్ని కష్టనష్టాలు ఎదురైనప్పటికీ ప్రజల కోసం చివరిదాకా నిలబడతామని, ప్రజా సంక్షేమం కోసం ఎవరితోనైనా కలబడతామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేర్కొన్నారు. బుధవారం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రి కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదిమూలపు సురేష్, మార్కాపురం ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, గిద్దలూరు ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, ఒంగోలు ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు, కనిగిరి ఇన్‌చార్జ్ దద్దాల నారాయణయాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, లిడ్‌క్యాప్ మాజీ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, పార్టీ సీనియర్ నాయకులు మాదాసి వెంకయ్య, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు కుప్పం ప్రసాద్‌తో కలిసి పార్టీ జిల్లా కార్యాలయంలోని దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి జెండా ఆవిష్కరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల జయజయధ్వానాల మధ్య జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్ సీపీ అని, పోరాటాలు, ఉద్యమాలు పార్టీకి కొత్త కాదని పేర్కొన్నారు. ఆది నుంచి అన్ని రకాల ఆటుపోట్లును ధీటుగా ఎదుర్కొని ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు అండగా నిలబడుతుందని చెప్పారు.
బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ తొలి నుంచీ పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నిరుపేద యువకులకు న్యాయం చేసేందుకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పోరాటం చేయడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. గత ఐదేళ్ల జగనన్న పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఎదో ఒక సంక్షేమ పథకాన్ని అందజేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేద బిడ్డల చదువుల కోసం ఏటా రూ.15 వేల రూపాయలు అందజేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. మహిళల రక్షణ కోసం దిశ యాప్‌ను తీసుకువచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చీరాగానే సచివాయాలను ఏర్పాటు చేసి లక్షలాది మంది యువకులకు ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ సచివాలయంతో పాటు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామ స్వరూపాన్నే మార్చివేశారన్నారు. కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, బీసీ సెల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, లీగల్ సెల్ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, సంతనూతలపాడు ఎంపీపీ గాయం సావిత్రి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బడుగు ఇందిర, పార్టీ రాష్ట్ర సెక్రటరీ భూమిరెడ్డి రమణమ్మ, ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న, అంగన్‌వాడీ వింగ్ అధ్యక్షురాలు వాణి, సాధం విజయలక్ష్మి, బత్తుల ప్రమీల, వి.మాధవి, బి.మేరీకుమారి, రమణమ్మ, షేక్ అఫ్సార్, గోనుకుంట రజిని, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి,
జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా 15వ ఆవిర్భావ దినోత్సవం
హాజరైన ఎమ్మెల్యే తాటిపర్తి, నియోజకవర్గ ఇన్‌చార్జులు
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు
ప్రజల కోసం నిలబడతాం.. కలబడతాం
ప్రజల కోసం నిలబడతాం.. కలబడతాం
Comments
Please login to add a commentAdd a comment