
కుంచేపల్లి ఎస్సీ కాలనీలో వైద్య శిబిరం ఏర్పాటు
పొదిలిరూరల్: పొదిలి మండలంలోని కుంచేపల్లి ఎస్సీ కాలనీలో వారం రోజులపాటు వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఉప్పలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎం.సుగుణకుమార్ తెలిపారు. కాలనీ మొత్తం జ్వరాలతో ఇబ్బందులు పడుతుండటం, పారిశుధ్య లోపంపై ‘మంచం పట్టిన కుంచేపల్లి ఎస్సీ కాలనీ’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. డాక్టర్ సుగుణకుమార్ మాట్లాడుతూ.. కాలనీ వాసులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి జ్వర పీడుతులను గుర్తించారని చెప్పారు. కాలనీలో మురుగు నిల్వ ఉన్న ప్రాంతంలో బ్లీచింగ్ పౌడర్ చల్లించడంతోపాటు ఎబేట్ ద్రావణం పిచికారీ చేయించామని, దోమల నివారణకు ఫాగింగ్ చేయించామని వివరించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
కాలనీలో బ్లీచింగ్, ఫాగింగ్, ఎబేట్ పిచికారీ వారం రోజులపాటు వైద్య శిబిరం నిర్వహణకు చర్యలు

కుంచేపల్లి ఎస్సీ కాలనీలో వైద్య శిబిరం ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment