
ఇతరుల పేరుపై భూమి ఆన్‌లైన్
పొదిలి: తరతరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూమిని ఇతరుల పేరుపై ఆన్‌లైన్ చేశారని నందిపాలెం గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు వెంకట సుబ్బయ్య, అంజిరెడ్డి గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సమస్య పరిష్కరించే వరకు కదిలేది లేదని కార్యాలయంలోనే భైఠాయించి నిరసన తెలిపారు. ఆరేళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని పెద్ద పెట్టున కేకలు వేశారు. తహసీల్దార్ ఎంవీ కృష్ణారెడ్డి ఆదేశాలతో కార్యాలయానికి చేరుకున్న పోలీసులు తండ్రీ కొడుకులను బయటకు తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో సుబ్బయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. అంజిరెడ్డిని పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లి తమ జీప్‌లో పడేశారు. ఈ విషయమై తహసీల్దార్‌ను వివరణ కోరగా.. ఆరేళ్ల క్రితం నాటి సమస్యపై ఇప్పుడు మరోమారు ఫిర్యాదు చేశారు. భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైనా ఉంటే ఇవ్వాలని కోరగా వినిపించుకోలేదు. మద్యం సేవించిన అంజిరెడ్డి దుర్భాషలాడటంతో పోలీసులకు సమాచారం ఇచ్చా. వారి వద్ద ఉన్న డాక్యుమెంట్లు అందచేస్తే పరిశీలించి న్యాయం చేస్తా’ అని చెప్పారు.
తహసీల్దార్ కార్యాలయం వద్ద తండ్రీకొడుకుల నిరసన ఈడ్చిపడేసిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment