కనులపండువగా బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం
కొనకనమిట్ల: ప్రముఖ పుణ్యక్షేత్రం వెలుగొండలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు భక్తి పరవశంతో జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీలక్ష్మీ అలివేలుమంగ వెంకటేశ్వరస్వామి వార్లను వ్యాలీ వాహనంపై ఊరేగించారు. ప్రత్యేకంగా అలంకరించిన స్వామివార్లను వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య మేళతాళాలతో పురవీధుల్లో ఊరేగించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే సానికొమ్ము పిచ్చిరెడ్డి, సానికొమ్ము కొండారెడ్డి కుటుంబసభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుందురు కాశిరెడ్డి పర్యవేక్షణలో ఉత్సవాలు కొనసాగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేదపండితులు ప్రసాదాచార్యులు, భార్గవాచార్యులు, సింహాద్రీచార్యులు స్వామికి అర్చనలు, అభిషేకాలు చేశారు. కొండపై ఉన్న అమ్మవారిని, గంగమ్మతల్లి ఆలయంలో భక్తులు పూజలు చేసి స్వామివార్లను దర్శించుకున్నారు. సోమవారం శ్రీవారు సింహ వాహనంపై ఊరేగుతారని ఈఓ తెలిపారు.
కోర్టు పనులను పరిశీలించిన హైకోర్టు జడ్జి
సింగరాయకొండ: మండల కాంప్లెక్స్‌లో నూతనంగా నిర్మిస్తున్న జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పనులను ఆదివారం హైకోర్టు జడ్జి జస్టిస్ కె.మన్మథరావు పరిశీలించారు. 25వ తేదీ నాటికి పనులు పూర్తి కావాలని అధికారులకు సూచించారు. కోర్టుకు వచ్చేందుకు అవకాశం ఉండేలా రోడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కందుకూరు జూనియర్ సివిల్ జడ్జి ఎన్ నిఖిల్‌రెడ్డి, న్యాయవాదులు, అధికారులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కొమరోలు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని ముత్రాసుపల్లె సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే.. తాటిచెర్ల గ్రామానికి చెందిన గంగిపోగు ఫ్రాన్సిస్ (34) కూలీ పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై బేస్తవారిపేట సమీపంలోని పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా ముత్రాసుపల్లె సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
వ్యాలీ వాహనంపై ఊరేగిన
వెంకటేశ్వరుడు
కనులపండువగా బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం
కనులపండువగా బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం
కనులపండువగా బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం
Comments
Please login to add a commentAdd a comment