మహోన్నత వ్యక్తి పొట్టిశ్రీరాములు
ఒంగోలు వన్‌టౌన్: తెలుగు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని నగరంలోని సీవీన్ రీడింగ్ రూం సెంటర్‌లోని ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజలకోసం, దేశం కోసం చేసిన త్యాగాలు మరువలేనివన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ మాట్లాడుతూ దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు త్యాగమే నాంది పలికిందన్నారు. మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయకుమార్ మాట్లాడుతూ పోరాట పటిమకు, కార్యదీక్షకు ప్రతిబింబంగా నిలి
చిన పొట్టి శ్రీరాములును యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రంతో పాటూ దళితులకు ఆలయ ప్రవేశం కోసం నిరాహార దీక్ష చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మానాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మి, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, తహశీల్దార్ వాసు తదితరులు పాల్గొన్నారు.
అమరజీవి ప్రాణత్యాగాన్ని విస్మరించకూడదు
ఒంగోలు టౌన్: పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్లే తెలుగు రాష్ట్రం ఏర్పాటైందన్న విషయం విస్మరించరాదని ఎస్పీ ఏఆర్ దామోదర్ చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ...భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణమైన పొట్టి శ్రీరాములు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. మహాత్మా గాంధీ మార్గంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఎలాంటి హింసకు తావులేని ఉద్యమాన్ని చేపట్టారని, ఆమరణ నిరాహార దీక్ష ద్వారా రాష్ట్రాన్ని సాధించారన్నారు. అంటరానితనం నిర్మూలన కోసం అహర్నిశలు పాటుపడ్డారని కొనియాడారు. పొట్టి శ్రీరాములు జీవితం నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర, వన్‌టౌన్ సీఐ నాగరాజు, తాలుకా సీఐ అజయ్‌కుమార్, ఆర్‌ఐ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహోన్నత వ్యక్తి పొట్టిశ్రీరాములు
Comments
Please login to add a commentAdd a comment