పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు..
పదో తరగతి పరీక్షలు జరిగే సమయంలో ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్ష జరిగే కేంద్రాల సమీప ప్రాంతాల్లో జెరాక్స్ సెంటర్లు, ఇంటర్‌నెట్ సెంటర్లు మూసేయాలి. అలాగే కేంద్రంలోకి స్మార్ట్‌వాచ్‌లు, కాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్లను నిషేధించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 1900 మంది ఇన్విజిలేటర్లను, 183 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 183 మంది డిపార్టుమెంట్ అధికారులను నియమించారు. పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి మాస్‌కాపీయింగ్‌కు పాల్పడకుండా 9 ఫ్లయింగ్ స్క్వాడ్, 20 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు.
పరీక్షల షెడ్యూల్ ఇలా
ఈనెల 17వ తేదీ తెలుగు, 19న హిందీ,
21న ఇంగ్లిషు, 24న గణితం, 26న ఫిజిక్స్, 28న బయాలజి, 31న సోషల్ పరీక్షలు జరగనున్నాయి.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం విద్యాశాఖాధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వసతుల విషయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే కంట్రోల్ రూమ్ నంబరు 78427 77439 కు ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తారు.
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఎస్‌ఎస్‌సీ) షెడ్యూల్ ఇలా..
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఎస్‌ఎస్‌సీ) పరీక్షలు ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ శివకుమార్ తెలిపారు. ఈ పరీక్షల కోసం 23 పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1564 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు సమయం ఉంటుంది. 6 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు.
కంభంలోని పరీక్ష కేంద్రం
Comments
Please login to add a commentAdd a comment