నకిలీ పత్రాలలో ఆటో ఆమ్మి మోసం చేశారు...
నా పేరు షేక్ షంషాద్. ఒంగోలు నగరంలోని రంగుతోటలో నివాసం ఉంటున్నా. కుటుంబ పోషణ నిమిత్తం నేను, నా భర్త కలిసి షేక్.కాలేషా అనే అతడి వద్ద సెకండ్ హ్యాండ్‌లో రూ.1.80 లక్షలకు ఆటో కొనుగోలు చేశాం. నెలకు రూ. 6900 చొప్పున 8 నెలల కిస్తీ కట్టిన తరువాత నా పేరు మీద ఆటో ట్రాన్స్‌ఫర్ చేసేలా అంగీకారం చేసుకున్నాం. డబ్బులు కట్టిన తరువాత కాగితాలు ట్రాన్స్‌ఫర్ చేయమంటే ఆటో అమ్మిన వ్యక్తి మృతి చెందారని అబద్దాలు చెప్పారు. 4 నెలల్లో మొత్తం డబ్బులు చెల్లిస్తే ట్రాన్స్‌ఫర్ చేస్తామని నమ్మబలికారు. డబ్బులు మొత్తం కట్టాక నకిలీ పత్రాలు సృష్టించి ఇచ్చారు. తర్వాత కొన్ని రోజులకే ఆటోను ఆర్టీఓ పట్టుకొని కేసు పెట్టారు. ఆటో తీసుకొని నేను కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడితే సమాధానం చెప్పకపోగా నీ ఇష్టమొచ్చింది చేసుకో...నయా పైసా ఇవ్వను అంటూ కాలేషా బెదిరిస్తున్నాడు. 4 నెలలుగా బండి ఆగిపోయింది. కుటుంబం నడవడం కష్టంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment