తహసీల్దార్ కసురుకుంటున్నారు..
నా పేరు గూడా ధనలక్ష్మి. మాది పీసీపల్లి మండలం తురకపల్లి గ్రామం. నాన్న వెంకట పుల్లారెడ్డి బొరుగుల బట్టీ నిర్వహిస్తుంటారు. అమ్మ చిన్నమ్మ గృహిణి. మా నాన్న కష్టపడి పైసా పైసా కూడ బెట్టి 1996వ సంవత్సరంలో 20 సెంట్ల పొలం కొన్నారు. అప్పట్లో రిజిస్టర్ డాక్యుమెంట్లు ఆన్‌లైన్ కాలేదు. ఆ విషయం గురించి మాకు అవగాహన కూడా లేదు. దాన్ని అడ్డం పెట్టుకొని మాచవరం గ్రామానికి చెందిన నూరసాని నరసారెడ్డి, బోడా రవిచంద్రా రెడ్డి, మార వెంకటేశ్వర్లు మా స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించారు. ఈ విషయంలో మండల సర్వేయర్ దగ్గరకు వెళితే మీరు పొజిషన్‌లో లేరంటూ దురుసుగా మాట్లాడుతున్నాడు. తహసీల్దార్ దగ్గరకు వెళితే కసురుకుంటున్నారు. 9 నెలలుగా తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాను. కలెక్టర్ ఆఫీసులో రెండు సార్లు ఫిర్యాదు చేశాను. మళ్లీ ఈ రోజు రమ్మంటే వచ్చాను. మాది నిరుపేద కుటుంబం. ప్రభుత్వమే న్యాయం చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment